ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం తాజాగా మరో 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అనంతపురం 4, చిత్తూరు 14, కడప 2, కృష్ణా 9, కర్నూలు 8,నెల్లూరు 14, విజయనగరం 3, విశాఖపట్నం 2, తూర్పు గోదావరి 1 ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని 1252 మంది డిశ్చార్జ్‌ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 857గా ఉంది. గడిచిన 24 గంటల్లో 60 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,038 సాంపిల్స్ ని పరీక్షించగా 102 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. వీటిలో 45 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకి చెందినవిగా(మహారాష్ట్ర 34, రాజస్థాన్ 11) ఉన్నాయి.