ఏపీలో కొత్తగా 570 కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 570 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 570 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 570 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,489కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 22,305 శాంపిల్స్‌ను పరీక్షించగా 570 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కర్నూల్‌, కృష్ణలలో నలుగురు చొప్పున, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడగా.. 191మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.