ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా మరో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 955కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 145 మంది డిశ్చార్జ్‌ కాగా, 29 మరణించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో 781 మంది చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో అనంపురం జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 27, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో నమోదైన కేసులో ఎక్కువ భాగం మూడు జిల్లాలోనే ఉన్నాయి.