: రాష్ట్ర కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని పార్కింగ్ ప్రదేశం వద్ద వేదికను ఏర్పాటు చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆంగ్ల భాష అక్షరమాలను అనుసరించి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు.అనంతరం అంజాద్ బాషా (కడప), ఆదిమూలపు సురేశ్ (ఎర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బూడి ముత్యాల నాయుడు(మాడుగుల)తో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా (తుని), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), గుడివాడ అమర్నాథ్ (అనకాపల్లి) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
