ఏపీలో మరో 141 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 11,775 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. కరోనాతో కోలుకొని 59 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,402 కేసులు నమోదవ్వగా, 80 మంది కరోనాతో పోరాడి మృత్యువాత పడ్డారు. మొత్తం 2,599 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రలో ప్రస్తుతం 1723 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి