ఏపీలో మరో 147 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15,085 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ పరీక్షల్లో 147 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ వివరించింది.గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 16 మంది డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరణించిన ఆ ఇద్దరు కృష్ణా, అనంతపురం జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 3990 కరోనా కేసులు నమోదు కాగా 2403 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు 77 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1510 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.