ఏపీలో మరో 48 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,719కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 8,148 శాంపిల్స్‌ను పరీక్షించగా 48కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 55 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు 1903 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటివరకు 57 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 759 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.