ఏపీలో మరో 50 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో(గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు) 9,831 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కేవలం 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 21 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,294కు చేరింది. వైరస్‌తో నిన్న ఇద్దరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.