ఏపీలో మరో 704 కరోనా కేసులు
ఏపీలో మరో 704 కరోనా కేసులు

ఏపీలో మరో 704 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మరో 648 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51మందికి, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 18,114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 704 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,595కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 187కి చేరింది.