ఏపీలో మరో 81 కరోనా పాజిటివ్‌ కేసులు
ఏపీలో మరో 81 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో మరో 81 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో మరో 81 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1097కి చేరింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటివరకు 231 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా, 31 మంది ప్రాణాలు కోల్పొయారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 835గా ఉంది. కాగా గత కొన్ని రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం దూసుకువెళుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. దేశంలో పదిలక్షల మంది జనాభాకు 418 మందికి టెస్టులు, రాష్ట్రంలో 1, 147 టెస్టులు చేస్తున్నారు