గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6534 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1583కు చేరుకుందని వెల్లడించింది. గత 24 గంటల్లో మరో 47 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారని, దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 488 కు చేరుకుందని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33 కోవిడ్ మరణాలు సంభవించాయని, గత 24 గంటల్లో ఎటువంటి మరణాలు చోటుచేసుకోలేదని ఆరోగ్యశాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది.

ఏపీలో 1583 కి చేరిన కరోనా కేసులు