ఏపీలో 1,777కి చేరిన కరోనా కేసులు
ఏపీలో 1,777కి చేరిన కరోనా కేసులు

ఏపీలో 1,777కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,777కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 7,782 శాంపిల్స్‌ పరీక్షించగా.. 60 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. వీరిలో తూర్పు గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 12, వైఎస్సార్‌ జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 17, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతోపాటుగా కర్ణాటకకి చెందినవి 1, గుజరాత్‌కు చెందినవి 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో మిగతా 7 జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.