ఏపీలో 1833 కి చేరిన కరోనా కేసులు
ఏపీలో 1833 కి చేరిన కరోనా కేసులు

ఏపీలో 1833 కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,833కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 8,087 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 56 మందికి కరోనా నిర్దారణ అయినట్టు పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,49,361 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో.. అనంతపురం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 10, వైఎస్సార్‌ జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 16, నెల్లూరు జిల్లాలో 4, విశాఖపట్నం జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి.