ఏపీలో 420 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో 420 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 420 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 15 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇవాళ నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 420. కాగా.. ఇవాళ కరోనాతో మరొకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనాతో మొత్తం ఏడుగురు చనిపోయారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 9గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 6గంటల వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా.. గుంటూరులో 07, నెల్లూరులో 04, కర్నూలులో 02, చిత్తూరు, కడపలో ఒక్కో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.