ఏపీలో 5280కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు
ఏపీలో 5280కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో 5280కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 193 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5280​కి చేరింది. గడిచిన 24 గంటల్లో 15,911 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 193 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా చిత్తూరు, ప్రకాశం నుంచి రెండు మరణాలు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య 88కి చేరింది. కాగా ఇవాళ కొత్తగా 81 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇప్పటివరకు వైరస్‌ నుంచి 2851 మంది కోలుకున్నారు.