ఏపీలో 603 కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 603కు చేరుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో 31 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఒక కృష్ణా జిల్లాలోనే 18 కొత్త కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార బృందం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 42 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 546 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. .