ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజును ప్రభుత్వం నియమించింది. ఈయన మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కనగరాజు వ్యవహరించారు. కాగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హత నిబంధనలను మారుస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గెజిట్‌లో ప్రభుత్వం ప్రచురించింది. శనివారం ఉదయం ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి స్థాయి అధికారిని నియమించడం, కాలపరిమితి మూడేళ్లకు కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొన్నది.