ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అదే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది