ఏపీ లో ఆరుగురు ఐఎఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఎంఆర్‌డిఎ కమిషనర్‌గా కె.విజయ, సీసీఎల్‌ఎ అప్పిల్స్‌ కమిషనర్‌గా డాక్టర్‌ పి.లక్ష్మీనరసింహం, ఎఎంఆర్‌డిఎ అడిషనల్‌ కమిషనర్‌గా పి.ప్రశాంతి, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివఅద్ధి జేసీగా జి.రాజకుమారి, కడప ఆర్‌డిఒ గా పి.ధర్మచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ సెక్రటరీగా పఅథ్వీ తేజ్‌ బదిలీ అయ్యారు. ఎపి పవర్‌ కార్పొరేషన్‌ ఎండి గా పఅథ్వీతేజ్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది.