ఏపీ లో 2,205కి చేరిన కరోనా కేసులు

ఏపీ లో 2,205కి చేరిన కరోనా కేసులు

ఏపీ లో కరోనా కేసుల సంఖ్య 2,205కి చేరింది. గత 24 గంటల్లో 9,628 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతిచెందగా, ఇప్పటివరకు ఎపిలో మృతిచెందిన వారి సంఖ్య 49కి చేరింది. కర్నూల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించినట్లు వెల్లడించింది. అదే సమయంలో 101 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 803 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,353 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. చిత్తూరులో 8, గుంటూరులో 9, కడపలో 1, కఅష్ణాలో 7, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 9, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసు నమోదయ్యాయని తెలిపింది.