ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష
ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష

ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష

విశాఖలో ఐటీ రంగానికి సంబంధించిన హై ఎండ్‌​ స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. దీనికి అనుబంధంగా సెంట్రల్‌ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో 2 సంస్థల్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వీటిల్లో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా భూముల గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో.. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.