ఐదు భాషల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్

అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ లుక్ విడుదలైంది. పుష్పక్ నారాయణ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఎర్రచందనం అక్రమంగా తరలించే ముఠాకి చెందిన వ్యక్తి గా అయన ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ను విడుదల చేయనున్నారు. బన్నీ కెరీర్లో ఒకేసారి ఐదు భాషల్లో విడుదల కానున్న తోలి సినిమా ఇదే. అలాగే అడవి నేపథ్యంలో చిత్తూరు యాసలో మాట్లాడే మాస్ యువకుడిగా ఆయన ఈరోల్ చేయడం కూడా ఇదే మొదటిసారి. అయన పాత్రను సుకుమార్ తీర్చిదిద్దిన తీరుపైనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోగా రష్మిక కనిపించనున్న సంగతి తెలిసిందే.