ఐదేళ్ల వయసులోనే.. రష్మిక

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది హీరోయిన్‌ రష్మిక మండన్న. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ గతేడాది ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ సినిమాలతో మంచి హిట్లు అందుకుంది. సక్సెస్‌లు అందుకోవడమే కాకుండా ఈ బ్యూటీ ఓ వర్గం ఆడియన్స్‌ని బాగానే ఎట్రాక్ట్‌ చేసింది. ఇక సోషల్‌ మీడియాలో చురుగ్గా కనిపించే ఈ చిన్నది ఒక మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై చిన్నప్పుడే మెరిసిందట! దానికి సంబంధించిన మ్యాగజైన్‌ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా మ్యాగజైన్‌లపై అప్పుడప్పుడు రష్మిక హాట్‌ క్యూట్‌ లుక్స్‌తో దర్శనమిస్తుంటుంది. ఆమె సినిమాల కోసం ట్రై చేస్తున్న సమయంలోనే మ్యాగజైన్‌ కోసం రష్మిక ఫోటో షూట్స్‌లో పాల్గొంటూ ఉండేది. అయితే ఆమె మ్యాగజైన్‌లకు స్టిల్స్‌ ఇవ్వడం ఎప్పుడో నేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల వయసులోనే రష్మిక అప్పట్లో ఒక ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌కి స్టిల్‌ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోను రష్మిక సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

2001లో జరిగిన ఫోటో షూట్‌ అని చెబుతూ.. అప్పటి నుంచి ఆమె అమ్మ ఈ మ్యాగజైన్‌ని దాచుకుందని, ఇప్పటికీ ఇంకా దాచుకుంటూనే ఉందని రష్మిక స్వీట్‌గా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆ సినిమా కొత్త షెడ్యుల్‌ త్వరలోనే స్టార్ట్‌ కానుంది. ఇక కన్నడలో ఒక సినిమా రిలీజ్‌కి ఉండగా తమిళ్‌లో ‘సుల్తాన్‌’ అనే సినిమాను ఫినిష్‌ చేయడానికి రష్మిక ప్లాన్‌ చేసుకుంటోందట!