ఐ అండ్‌ పిఆర్‌ తొలి మహిళా ఎడిగా స్వర్ణలత

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ (ఐ అండ్‌ పిఆర్‌) తొలి మహిళా అదనపు సంచాలకులుగా ఎల్‌ స్వర్ణలతను రాష్ట్ర ప్రభుత్వం నియ మించింది. ఈ మేరకు ఐ అండ్‌ పిఆర్‌ కమిషనర్‌ తుమ్మా విజరుకుమార్‌రెడ్డి సోమవారం నాడు నియామక ఉత్తర్వులను స్వర్ణలతకు అందించారు. విజయవాడలోని కమిషనరేట్‌లో ఆమె అదనపు సంచాలకులుగా బాధ్యతలను స్వీకరించారు. 1992లో ఎపిపిఎస్సి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా డిపిఆర్వోగా ఎంపికైన ఎల్‌ స్వర్ణలత తొలుత గుంటూరు జిల్లా పౌర సంబంధాల శాఖ డిపిఆర్వోగా, అనంతరం నెల్లూరులోనూ విధులు నిర్వర్తించారు. రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకులుగా హైదరాబాద్‌, విజయవాడ, రాజమండ్రిలలో పనిచేశారు. ఆ తర్వాత ప్రాంతీయ ఉప సంచాలకులుగా పదోన్నతిపై విజయవాడ, ఒంగోలులలో పనిచేశారు. కోస్తా తీరంలోని అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా జోన్‌-1, జోన్‌-2, జోన్‌-3లలో పనిచేసిన స్వర్ణలత విశేష అనుభవం గడించడమే కాకుండా క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధి నిర్వహణలో మంచి పేరు సంపాదించారు.