ఒకేసారి నాలుగు చిత్రాల్లో నిఖిల్‌!

నిఖిల్‌ నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్‌పై వివిధ దశల్లో ఉన్నాయి. కరోనాకు ముందు నిఖిల్‌ ‘కార్తికేయ -2′ సినిమా షూటింగ్‌ ఆరంభించాడు. టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ 2, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో ’18 పేజెస్‌’ మూవీకి కమిట్‌ అయ్యాడు. అనుపమా పరమేశ్వరన్‌ నాయికగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో బన్నీ వాసు, సుకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్‌ ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్‌. దర్శకత్వం వహిస్తున్న యాక్షన్‌ స్పై మూవీలోనూ నిఖిల్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల మొదటివారంలో మొదలైంది.