ఒక్కపూటే భోజనం చేసేదాన్ని..సమంత

 టాలీవుడ్‌ నుంచి పాన్‌ ఇండిగా లెవల్‌ నటిగా మారిన సమంత ఒకప్పుడు రోజుకు రూ. 500 కోసం పనిచేశారట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను సినిమాల్లోకి రాకముందు డబ్బులు కోసం చాలా ఇబ్బందులు పడ్డాను. తినడానికి కూడా లేక ఒక్కపూట మాత్రమే భోజనం చేశాను. అలా ఒకరోజు రెండు రోజులు కూడా కాదు. దాదాపు రెండు నెలలు ఒక్కపూటే తిన్నాను. పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్‌లకు వెల్‌కమ్‌ చెప్పే అమ్మాయిగా చేశాను. అలా చేసినందుకు రోజుకు రూ. 500 ఇచ్చేవారు. అలా డబ్బులు కోసం చిన్న చిన్న ఉద్యోగాలూ చేస్తూ.. మోడలింగ్‌ వైపు వెళుతన్న సమయంలో.. నన్ను ఎంతోమంది వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. ఎంతమంది వెనక్కిలాగాలని చూసినా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగు వేసి సక్సెస్‌ అయ్యాను’ అంటూ సమంత చెప్పుకొచ్చారు.