ఒక్కరోజులోనే 4987 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4987 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పాటు 124 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వైరస్‌ వెలుగుచూసిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో కేసుల నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 90, 927కి చేరుకుంది. ఇక వైరస్‌ సోకి 2872 మంది మృత్యువాతపడ్డారు. వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 38,108 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 58,946 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మూడో విడత లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తరువాత కరోనా వ్యాప్తి మరింత పెరిగినట్లు తెలుస్తోంది