భారత్‌లో కరోనా రోజురోజుకి ఉధృతంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,516 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,95,048కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 375 మంది మరణించడంతో.. మృతుల సంఖ్య 12,948కి చేరింది. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతుండగా, 2,13,830 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో 1,24,331 పాజిటివ్ కేసులు నమోదవగా, అత్యధికంగా 5,893మంది మరణించారు. తమిళనాడులో 54,449 కేసులు నమోదవగా, 666మంది మరణించారు. ఢిల్లీలో 53,116 కేసులు నమోదవగా, 2,035 మంది మృత్యువాత పడ్డారు.
