కరోనా పిశాచి మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 3.50 లక్షలు, మరణాలు 11 వేల మార్కును దాటేశాయి. దేశంలో ఈ మహమ్మారి వల్ల తాజాగా 2,003 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర, ఢిల్లీలో ఇటీవలే సంభవించిన కొన్ని మరణాలకు కరోనా వైరస్ కారణమని తేలడంతో వాటిని కూడా ఈ జాబితాలో చేర్చారు. దీంతో బుధవారం మరణాల సంఖ్య 2,003గా నమోదయ్యింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఒక్కరోజులో ఇండియాలో కొత్తగా 10,974 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 3,54,065కు, మరణాలు 11,903కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కరోనా కేసులు 1,55,227 కాగా, 1,86,934 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 52.79 శాతంగా నమోదయ్యింది.

ఒక్కరోజే 2,003 మంది మృతి