ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. ‘ మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు పోరాటానికి అభినందనలు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మీరు ఇంత దూరం రావటం మాకు ఎంతో గర్వకారణం, మీ పయనం ఇక్కడితో ఆగిపోలేదు. విజేత ఆస్ట్రేలియాకు అభినందనలు’ అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడ్డ భారత్ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే.

ఓటమి విజయానికి తొలిమెట్టు : జగన్