ఓటీటీలో ‘క్లాప్‌’ విడుదల

పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్లాప్‌’. బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ అధినేత ఐ.బి. కార్తికేయన్‌ సమర్పణలో శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌, శ్రీ షిర్డీ సాయి మూవీస్‌ పతాకాలపై రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ‘సోనీలివ్‌’ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రం టీజర్‌, ట్రైలర్‌ను ఆవిష్కరించారు. హీరో, హీరోయిన్‌లు స్పోర్ట్స్‌ పర్సన్స్‌గా కనిపిస్తున్నారు. కామెడీ, డాన్స్‌, ఫైట్స్‌ వంటి కమర్షియల్‌ అంశాలు లేకుండా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే అంశాలున్నాయి. ఇళయరాజా సంగీతం అందించారు.