ఓటీటీలో బంగార్రాజు

నాగార్జున, నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘బంగార్రాజు’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే థియేటర్‌ రన్‌ పూర్తి చేసుకున్న ‘బంగార్రాజు’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.