కడప లో కానిస్టేబుల్ కి కరోనా పాజిటివ్
కడప లో కానిస్టేబుల్ కి కరోనా పాజిటివ్

కడప లో కానిస్టేబుల్ కి కరోనా పాజిటివ్

కడప నగరంలో ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. కడపలోని రెడ్‌ జోన్‌ ప్రాంతంలో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉంది. రెడ్‌ జోన్‌లో విధులు నిర్వహిస్తున్న తరుణంలోనే ఆ కానిస్టేబుల్‌కు కరోనా సోకి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ కానిస్టేబుల్‌ ఎవరిని కలిశాడు, ఏయే ప్రాంతాల్లో తిరిగాడు అనే వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు.