కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్‌ ప్రీత్‌?

తెలుగులో బయోపిక్‌ల టైమ్‌ నడుస్తోంది. ఇటీవల సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘మహానటి’ అనూహ్య విజయాన్ని సాధించడంతో చాలా మంది మరిన్ని జీవిఒత కథల్ని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా 2000లో ఒలింపిక్‌ మొడల్‌ని మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో భారత్‌కు అందించి చరిత్ర సష్టించింది కరణం మల్లేశ్వరి. ఆమె జీవిత కథ ఆధారంగా త్వరలో ఓ సినిమా రాబోతోంది. కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కరణం మళ్లేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని కోన వెంకట్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. మహిళా దర్శకురాలు సంజన రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. ఈ మూవీ ప్రకటించిన దగ్గరి నుంచి సర్వత్రా చర్చ నడుస్తోంది. కరణం మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారా అని. నిత్యామీనన్‌ అని కొంత మంది ప్రచారం చేస్తే.. లేదు ఆ పాత్రలో తాప్సీ నటించడానికి ఆసక్తి చూపిస్తోందిని, ఆమె అయితే ఉత్తరాదిలోనూ ఈ చిత్రానికి మంచి మార్కెట్‌ ఏర్పడుతుందని ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం కరణం మల్లేశ్వరి పాత్రలో క్రేజీ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటించడానికి ఆసక్తిగా వున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కథ విన్న రకుల్‌ ఈ పాత్రలో నటించడానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అఫీషియల్‌ న్యూస్‌ త్వరలోనే బయటికి రానున్నట్టు ఇండిస్టీ వర్గాల్లో వినిపిస్తోంది.