కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే మృతి

తమిళనాడులో కరోనా వైరస్‌ తీవ్ర విషాదాన్ని నింపింది. వైరస్‌ బారినపడిన డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ (62) మృతి చెందారు. కరోనా సోకడంతో గతవారం ఆ‍స్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన 63వ పుట్టినరోజు నాడే మరణించడం తీవ్ర విషాదకరం. చెన్నై చేపాక్కం –ట్రిప్లికేన్‌ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఈనెల రెండో తేదీన ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. పరీక్షించగా కరోనా నిర్ధారణ అయ్యింది. చెన్నైలోని క్రోంపేటలోని రేల ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం ఐసీయూకు తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతిచెందారు.