కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే కన్నుమూత
కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే కన్నుమూత

కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే కన్నుమూత

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనా వైరస్ తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గత నెలలో ఆయనకు నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత నుంచి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు

తమోనాశ్ మృతి పట్ల టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘35 ఏళ్ల పాటు ప్రజలు, పార్టీ కోసం తమోనాశ్ పని చేశారు. ఆయన లేని లోటు పూడ్చుకోలేం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ మమతా ట్వీట్ చేశారు