కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఆదివారం నాడు ఇళ్లలోని విద్యుత్ లైట్లను ఆపేసి, జ్యోతులు వెలిగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు రాష్ట్ర ప్రజలంతా ప్రతిస్పందించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కోరారు.. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నేడు రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి, ఇంట్లోని విద్యుత్ దీపాలను ఆపివేసి, జ్యోతులు వెలిగించి ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలన్నారు. చమురు దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్ ఫ్లాష్‌లైట్లు … ఇలా ఏదో ఒక రూపంలో కాంతిని వెలిగించి, కరోనా అనే చీకటి మహమ్మారిని తరిమేద్దామనే సంకల్పాన్ని చాటడం అత్యవసరమన్నారు. తద్వారా మార్చి 22నాటి జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పాలన్నారు.
