కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా నివారణలో భాగంగా కలెక్టర్లతో జగన్ మాట్లాడనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. కాగా కాన్ఫరెన్స్ అనంతరం జగన్ మీడియా మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది.కాగా.. కరోనా వైరస్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో ధైర్యాన్ని నింపాలే తప్ప భయాన్ని కాదని ఇదివరకే జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
