కరోనాపై రాజ‌మౌళి ట్వీట్‌
కరోనాపై రాజ‌మౌళి ట్వీట్‌

కరోనాపై రాజ‌మౌళి ట్వీట్‌

ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలన్నీ స్తంభించాయి. ఏ రంగాన్నీ వదలని కోవిడ్‌.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే 6వేల మందికిపైగా మృతి చెందగా.. లక్షా 80వేలకు పైగా కేసులు ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజ‌మౌళి కరోనా వైరస్‌పై స్పందించారు. ‘క‌రోనా కార‌ణంగా ప్రపంచం నిలిచిపోవ‌డం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో భ‌యాందోళ‌న‌లు వ్యాప్తి చెంద‌కుండా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. కోవిడ్ 19 వ్యాప్తిని నివారించ‌డానికి తగిన చర్యలను పాటించండి. కరోనాపై అప్ర‌మ‌త్తంగా ఉంటే మంచింది’ అని రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.