కరోనా ఎఫెక్ట్ ఒక్క రోజే 242 మంది మృతి

కరోనా ఎఫెక్ట్.. ఒక్క రోజే 242 మంది మృతి

చైనాలో క‌రోనా మృత్యుకేళి తారా స్థాయికి చేరింది. హుబాయ్ ప్రావిన్సులో ఈ వైర‌స్ వ‌ల్ల బుధ‌వారం ఒక్క రోజే 242 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌ర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. బుధ‌వారం రోజునే కొత్త‌గా సుమారు 15వేల క‌రోనా కేసులు కూడా న‌మోదు అయ్యాయి. క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగా 1310కి చేరుకున్న‌ది. క‌రోనా వైర‌స్ బారిన ప‌డి.. ఆ త‌ర్వాత కోలుకున్న వారి సంఖ్య 3441కి చేరుకున్న‌ది. ప్ర‌స్తుతం సుమారు 34 వేల మంది చికిత్స పొందుతున్న‌ట్లు చైనా వార్త సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి.