కరోనా ఎఫెక్ట్ : రంగంలోకి దిగిన కేటీఆర్
కరోనా ఎఫెక్ట్ : రంగంలోకి దిగిన కేటీఆర్

కరోనా ఎఫెక్ట్ : రంగంలోకి దిగిన కేటీఆర్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్‌కూ వ్యాపించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా నేపథ్యంలో బస్సులన్నింటినీ కడిగి శుభ్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సూచనలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో మెట్రో, ఆర్టీసీ అధికారులకు సైతం ట్విట్టర్ వేదికగా సూచనలు చేశారు. బెంగుళూరు తరహాలో సత్వరమే చర్యలను చేపట్టాలని హైదరాబాద్ మెట్రో రైల్, ఎల్అండ్‌టీ ఎండీలను అభ్యర్థిస్తున్నా. అలాగే ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ గారు టీఎస్‌ఆర్టీసీలో సైతం చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నా అని కేటీఆర్ ట్వీట్ చేశారు.