కరోనా టెస్ట్‌ చేయించుకున్న సీఎం జగన్‌
కరోనా టెస్ట్‌ చేయించుకున్న సీఎం జగన్‌

కరోనా టెస్ట్‌ చేయించుకున్న సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వచ్ఛందంగా కోవిడ్‌-19 (కరోనా) పరీక్ష చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి తెప్పించిన రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా ముఖ్యమంత్రికి శుక్రవారం వైద్యులు పరీక్ష చేశారు. ఈ పరీక్షలో నెగిటివ్‌గా నిర్థారణ అయింది. కాగా ఇవాళ ఉదయం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కిట్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ను వైద్యులు పరీక్షించారు. కోవిడ్‌ –19 నివారణా చర్యల కోసం ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా చార్టర్‌ విమానంలో దక్షిణ కొరియాలోని సియోల్‌ నుంచి ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్‌ ఈ కిట్లను ప్రారంభించారు.