కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష
కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలన్నారు. కోవిడ్‌-19 నివారణ చర్యలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా… కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగిందని అధికారులను అభినందించారు. మరింత విస్త్రృతంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అదే సమయంలో ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా.. డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఎవరికీ ఏ సమస్య ఉన్నా 1902కు కాల్‌ చేయాలని సూచించారు