కరోనా నివారణ పై సీఎం జగన్‌ సమీక్ష
కరోనా నివారణ పై సీఎం జగన్‌ సమీక్ష

కరోనా నివారణ పై సీఎం జగన్‌ సమీక్ష

కరోనా నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకూ 150 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకే పాజిటివ్‌ కేసు వచ్చిందని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గొచ్చని భావిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.