కరోనా పరిస్థితులపై నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ ఫోన్‌

రాష్ట్రంలో తగ్గుతున్న పాజిటివిటీ రేటు, వేగంగా పెరుగుతున్న రికవరీ రేటుపై ప్రధాని మోడీకి అప్‌డేట్‌ ఇచ్చినట్లు మధ్యప్రదేశ్‌ ఎంపి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. జనతా కర్ఫ్యూ సహా వైరస్‌ ఎదుర్కొవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయనకు వివరించినట్లు తెలిపారు. తమ చర్యల పట్ల మోడీ ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారని, కేంద్రం నుండి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీనిచ్చారని చెప్పారు. కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అందించేందుకు, ఆసుపత్రి పడకల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న చర్యల గురించి ప్రధానికి వివరించానని హిమాచల్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులను తెలుసుకునేందుకు గత మూడు రోజుల నుండి సుమారు 10 మంది ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడినట్లు సమాచారం.