కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు పల జాగ్రత్తలు పాటించాలని సూపర్ స్టార్ మహేష్ బాబు సూచించారు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కోవిడ్ నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాల్సిందే. ఇది కష్ట కాలమే అయినప్పటికీ… మనం దాన్ని ఆచరించి చూపించాలి. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇది. తప్పనిసరి అయితే తప్ప.. వీలనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండటంమంచిది’ అని పేర్కొన్నారు

కరోనా పై స్పందించిన మహేష్ బాబు