కరోనా బాధితులకు పవన్ కల్యాణ్‌ విరాళం
కరోనా బాధితులకు పవన్ కల్యాణ్‌ విరాళం

కరోనా బాధితులకు పవన్ కల్యాణ్‌ విరాళం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కరోనా వైరస్‌ బాధితులకు అండగా నిలిచారు. వైరస్‌ బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు ఒక్కో రాష్ట్రానికి రూ.50లక్షల చొప్పున సహాయం చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందచేస్తున్నట్లు పవన్ కల్యాణ్‌ తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయాలను విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.