రాష్ట్రంలోని కరోనా అనుమానితులందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32వేల మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, బాధితులకు అందుతున్న చికిత్స సహా ఇతర అంశాలపై సీఎం జగన్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రోటోకాల్ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు పేద బాధితులను గుర్తించి వారికి కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని అధికారులకు తెలిపారు.

కరోనా బాధితులకు 2వేలు ఆర్థిక సహాయం