కరోనా బారిన పడిన ప్రముఖ టీవీ నటి

లాక్ డౌన్ అనంతరం వెండితెర, బుల్లితెర నటులు ఉత్సాహంగా షూటింగ్ లను ప్రారంభించారు. అయితే, కరోనా తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో షూటింగ్స్ లో పాల్గొంటున్నవారు కరోనబారిన పడుతున్నారు. ఇటీవల ఇద్దరు టీవీ నటులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో బుల్లి తెర స్టార్ కు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. ‘నా పేరు మీనాక్షి’, ‘ఆమె కథ’ వంటి పాపులర్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తోన్ననవ్య స్వామి కూడా వైరస్ బారిన పడ్డట్లుగా తెలుస్తోంది. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతోన్న నవ్య… వైరస్ నిర్థారణ పరీక్షకు వెళ్లగా, ఆమెకు పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆమె పాల్గొన్న షూటింగ్ టీం సభ్యులు అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారట. షూటింగ్స్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మళ్ళీ షూటింగ్స్ కి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పెద్ద చిత్రాల దర్శక నిర్మాతలు, హీరోలు షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు.