కర్నూలులో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌

కర్నూలులో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఓ ఎంపి కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో నలుగురు డాక్టర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఏడుగురు డాక్టర్లకు కరోనా వైరస్‌ సోకింది. జిల్లాలో మొత్తం 275 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తొమ్మిదిమంది మృతి చెందారు. ఆసుపత్రి నుండి కోలుకున్న 30 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాలోని వైద్య రంగంలో తీవ్ర కలకలం రేగుతోంది. ఇప్పటికే ఏడుగురు డాక్టర్లకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. కర్నూలు, నంద్యాలలో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆత్మకూరు, నందికొట్కూరు వంటి ప్రాంతాల్లో వైరస్‌ కట్టడవుతోంది.